పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది | Actress Natasha Doshi Secret Wedding With Manan Shah, Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Natasha Doshi Marriage Photos: గతేడాది జూలైలో నిశ్చితార్థం.. నెల క్రితం పెళ్లి.. ఇప్పుడు పోస్ట్

Mar 3 2024 3:20 PM | Updated on Mar 3 2024 3:53 PM

Actress Natasha Doshi Wedding With Manan Shah Pics Viral - Sakshi

టాలీవుడ్‌కి చెందిన మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. మూడు రోజుల క్రితమే శుభకార్యం జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలు చూస్తుంటేనే వివాహం చాలా గ్రాండ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు బ్యూటీకి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్)

ముంబయి బ్యూటీ నటాషా దోషి.. మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 2012-17 మధ్య నాలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 2018లో 'జై సింహా' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఈమెకు మరో రెండు చిత్రాల్లో మాత్రమే అవకాశమొచ్చింది. శ్రీకాంత్ 'కోతలరాయుడు'లో హీరోయిన్‌గా, కల్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడవురా' మూవీలో స్పెషల్ సాంగ్‌ చేసింది.

2020 తర్వాత సినిమాల్ని పక్కనబెట్టేసిన నటాషా దోషి.. పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కానీ గతేడాది జూలైలో మనన్ షా అనే వ్యాపారవేత్త నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. త్వరలోనే పెళ్లి ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది జనవరి 31న కుటుంబ సభ‍్యుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. కానీ దాదాపు నెల తర్వాత ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిన విషయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే అందరూ నటాషా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement