
ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది. మోహిని- భరత్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని.
డిప్రెషన్‌లో..
నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు.
దాన్నుంచి బయటపడ్డా..
మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్ అయింది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్‌లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్