వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్‌ రీ ఎంట్రీ | Sakshi
Sakshi News home page

వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్‌ రీ ఎంట్రీ

Published Mon, Nov 6 2023 9:54 AM

Actress Malavika Re Entry In Movies - Sakshi

సీనియర్‌ నటి మాళవిక గుర్తుందా? 1990- 2000 దశకం కిడ్స్‌కు ఈ భామను అంత ఈజీగా మరిచిపోలేరు. తెలుగులో శ్రీకాంత్‌,వడ్డే నవీన్‌ సూపర్‌ హిట్‌ సినిమా అయిన 'చాలాబాగుంది' చిత్రంతో వెండితెరపై మెరిసింది. తర్వాత చంద్రముఖి,ఆంజినేయులు వంటి చిత్రాల్లో మెరిసింది. తమిళంలో చిత్తిరం పేసుదడి చిత్రంలో వాలమీనుక్కమ్‌ అనే ప్రత్యేక పాటలో మాళవిక డాన్స్‌ చాలా పాపులరైంది. ఈమె 1999లో అజిత్‌కు జంటగా ఉన్నై తేడా చిత్రం ద్వారా కథానాయికిగా కోలీవుడ్‌లో పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

అలా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ మాళవిక నాయకిగా నటించి పాపులర్‌ అయ్యింది. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఛాన్సులు ఆమెకు దక్కాయి. అలా ఐదేళ్లపాటు కథానాయకిగా కొనసాగిన ఈమెకు ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఆమైపె వివాదాస్పద నటి అని ముద్ర పడడమేననే ప్రచారం జరిగింది. దీంతో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయింది మాళవిక. కాగా ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె మళ్లీ చిత్రాల్లో నటించడానికి రెడీ అనే సిగ్నల్‌ ఇచ్చింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి రెడీ అయింది. అందులో భాగంగా తమిళ్‌లో సూపర్‌ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్‌ టీవీలో ప్రసారమవుతున్న 'ఊ సొల్రియా ఊ ఊ సొల్రియా' అనే కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటోంది. త్వరలోనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాల్లో రీ ఎంట్రీ అయ్యే అవకాశం లేకపోలేదు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement