అందమే ఆనందం.. జ్యోతిక ఫోటోలు వైరల్‌ | Actress Jyothika Beauty Secrets trending social media | Sakshi
Sakshi News home page

అందమే ఆనందం.. జ్యోతిక ఫోటోలు వైరల్‌

Mar 26 2026 7:03 AM | Updated on Mar 26 2026 7:11 AM

Actress Jyothika Beauty Secrets trending social media

అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం ఆన్నారో మహాకవి. అవును ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఏనాటి వరకైనా జీవితం అందం గురించే పరుగులు తీస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలా అందమైన నగుమోము కలిగిన అతిథులకు వయసు గుర్తుకు రాదని  చెప్పడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడికో ఎందుకు మనం నటి జ్యోతికనే తీసుకుంటే 1997లో ఒక హిందీ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసి, ఆ వెంటనే అంటే 1998లో అజిత్‌ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రమే సంచలన విజయాన్ని సాధించడం, జ్యోతిక నటన ప్రశంసనీయంగా ఉండడంతో ఆ తరువాత ఆమెకు నటిగా ఎదురు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. 

తమిళం, తెలుగు,హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. చంద్రముఖి చిత్రంలో ఈమె నటన రిమార్కబుల్‌. టైటిల్‌ రోల్‌లో అంత అద్భుతంగా నటించారు. అలా రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్‌ గ్రీన్‌ నాయకి పేరు తెచ్చుకున్న జ్యోతిక కెరీర్‌ ప్రారంభంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. వీరి పెళ్లి 2006 జరిగింది. ఆ తరువాత కొంతకాలం సంసార జీవితానికి పూర్తిగా సమయాన్ని కేటాయించారు. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్‌ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దష్టి పెట్టారు.

అయితే తన ఇమేజ్‌ కు సరిపోయే ఉమెన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్‌పై ఎక్కువగా దష్టి పెడుతున్నారు.అలా ఈమె నటుడు అజయ్‌ దేవగన్‌తో కలిసి నటించిన సైతాన్‌ చిత్రం 2024లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండు వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న జ్యోతిక తన అందాలను పదిల పరచుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తుంటారు. అందుకే 47 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందంగా, ఎనర్జిటిక్‌ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా  జ్యోతిక కొత్తగా ఫుల్‌ ఫిట్‌ నెస్‌తో కూడిన తన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌  అవుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement