రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్‌ | Actress Harshil Kalia passed away in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్‌

Mar 25 2026 11:38 AM | Updated on Mar 25 2026 11:43 AM

Actress Harshil Kalia passed away in Road Accident

రాజస్థాన్‌కు చెందిన యువ నటి, ప్రముఖ మోడల్‌ హర్షిల్‌ కాలియా (30) రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ డీకొట్టడంతో పల్టీలు కొట్టింది. షిప్రా పాత్ రోడ్డులో జరిగిన  ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే కారు వద్దకు చేరుకుని  ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.

‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్‌తో హర్షిల్ కాలియా పాపులర్‌ అయ్యారు. రాజస్థానీ ప్రాంతీయ సాంగ్స్‌లో ఆమె డ్యాన్సర్‌గా పనిచేశారు. ఆపై యాంకర్‌గా కూడా గుర్తింపు పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement