Actress Gautami Daughter: అలనాటి హీరోయిన్‌ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ!

Actress Gautami Daughter Subbalakshmi Bhatia Photos Goes Viral - Sakshi

నటి గౌతమి వారసురాలిని చూశారా? నేటి హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా తయారైంది. నటి గౌతమి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పదహారణాల తెలుగు అమ్మాయి అయిన ఈమె 1990 ప్రాంతంలో అగ్ర కథనాయకిగా వెలిగిపోయారు. తమిళం, తెలుగు తదితర దక్షిణాది భాషల్లో కథానాయికిగా నటించిన గౌతమి మంచి ఫామ్‌లో ఉండగానే 1998లో సందీప్‌ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు.

అయితే వీరి పెళ్లి కథ ఏడాదికే ముగిసిపోయింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి కూతురు పుట్టింది. ఆ పాపకు సుబ్బులక్ష్మి అని పేరు పెట్టారు. కొన్నాళ్ల తరువాత గౌతమి నటుడు కమలహాసన్‌తో సహజీవనం చేశారు. అలా పదేళ్లపాటు జరిగిన వారి సహజీవనంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గౌతమి కమలహాసన్‌ నుంచి దూరంగా వచ్చేసి కూతురుతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఆ తరువాత సామాజిక సేవ, రాజకీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గౌతమి అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు.

అయితే ప్రస్తుతం వాటికి కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కాగా ఆమె వారసురాలు సుబ్బలక్ష్మి ఇప్పుడు వార్తల్లోకి నిలుస్తోంది. కొద్ది రోజులుగా సుబ్బులక్ష్మి తన అందమైన ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. దీంతో అవి ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇదంతా ‘హీరోయిన్‌గా అవకాశాల కోసమేనా?’, త్వరలోనే హీరోయిన్‌ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఆమెది సినీ నేపథ్య కుటుంబమే కాబట్టి సుబ్బలక్ష్మికి హీరోయిన్‌గా అవకాశాలు రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక త్వరలో ఆమెను హీరోయిన్‌గా చూసే అవకాశం లేకపోలేదు అంటున్నారు నెటిజన్లు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top