షారుక్ సరసన ఎంట్రీ.. అధిక రెమ్యునరేషన్.. టాయిలెట్స్ శుభ్రం చేసిన హీరోయిన్!

Actress Bollywood debut with Shah Rukh Khan cleaned toilets for survival - Sakshi

బాలీవుడ్‌లో చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ‍అలాగే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది.  2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్‌షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్‌ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్‌లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్‌సఫర్‌లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది.

ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్‌ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది.

అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్‌లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది.

మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్‌ఎంజిల్స్‌లో ఉన్న సమయంలో ఫ్లోర్‌లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. 

కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్‌లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్‌లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్‌తో జతకట్టనుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top