
ఇండియన్ పాపులర్ యాక్టర్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన రెండో చిత్రం రాఘవేంద్ర హీరోయిన్ అన్షు కూడా బర్త్‌డే విషెష్ తెలిపింది. ప్రభాస్‌తో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. యూకేలో పుట్టి పెరిగిన అన్షు.. 15 ఏళ్లకే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. నాగార్జున 'మన్మథుడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె తొలి మూవీతోనే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తో రెండో సినిమా రాఘవేంద్రలో కనిపించింది.

రాఘవేంద్ర సినిమా తర్వాత 2003లో చివరగా మిస్సమ్మలో అన్షు నటించింది. అయితే, సుమారు 22ఏళ్ల తర్వాత తెలుగులో 'మజాకా' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. సైకాలజీలో మాస్టర్స్ చేసి యూకేలో సొంతంగా క్లినిక్ పెట్టుకున్న ఆమె.. 2011లో 24 ఏళ్ల వయసులోనే సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం.. ఆపై చదువు పరంగా ఇబ్బంది ఉంటుందని ఇండస్ట్రీ నుంచి దూరం జరిగినట్లు ఆమె చెప్పింది. తర్వాత సైకాలజిస్ట్‌గా స్థరపడ్డాక పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అలా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని గుర్తుచేసుకుంది. ఇప్పుడు తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంది. తాజాగా ప్రభాస్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్‌తో పాటు అన్షు, శ్వేతా అగర్వాల్ నటించారు. ఇందులో సిమ్రాన్ తొలిసారి ఒక ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది.