
సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే అనర్థాలు కూడా ఉన్నాయి. చాలామంది అదేపనిగా నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సెలబ్రిటీలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. ఇప్పుడు అలానే 'మన్మథుడు' హీరోయిన్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్లకు అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
'ఇద్దరు పిల్లల తల్లివి, కాస్త పద్ధతిగా ప్రవర్తించు.. 20 ఏళ్ల పిల్లవేం కాదు నువ్వు.. సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు బక్కపలుచగా ఉన్నావ్. ఇలాంటి కామెంట్స్ పెట్టే బదులు వేరే ఏదైనా పని చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల మీరు ఎలాంటి వాళ్లో అర్ధమవుతోంది. అవును నాకు ముడతలు ఉన్నాయి. ఇప్పటివరకు సర్జరీలు చేసుకోలేదు. ఫిల్లర్స్ కూడా పెట్టించుకోలేదు. బొద్దుగా ఉన్నప్పుడు నాకే ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ఓకే కదా? జీవితంలో ఏం చేయడానికైనా టైమ్ అంటూ లేదు. కలలు కనండి. మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి' అని అన్షు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
యూకేలో పుట్టి పెరిగిన అన్షు.. 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చింది. నాగార్జున 'మన్మథుడు' సినిమాతో పరిచయమైంది. తొలి మూవీతో హిట్ కొట్టింది. కానీ తర్వాత చేసిన రాఘవేంద్ర, మిస్సమ్మ చిత్రాలు ఫెయిలవడంతో తిరిగి యూకే వెళ్లిపోయింది. సైకాలజీలో మాస్టర్స్ చేసి సొంతంగా క్లినిక్ పెట్టుకుంది. 2011లో 24 ఏళ్ల వయసులోనే సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'మజాకా' మూవీతో అన్షు రీఎంట్రీ ఇచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షు రీఎంట్రీ సినిమా రిలీజ్ కాగా హిట్ కాలేదు. దీంతో ఈమె తిరిగి యూకే వెళ్లిపోయింది. అయితే గత కొన్నిరోజులుగా తన ఇన్ స్టా పోస్టుల్లో వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై ఇప్పుడు సెటైరికల్‌గా స్పందిస్తూ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?)