తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి | Sakshi
Sakshi News home page

తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి

Published Mon, Feb 19 2024 10:58 AM

Actress Alya Manasa Comments On Facebook Ad Scam - Sakshi

జనాల‍్ని మోసం చేయడంలో దొంగలు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే మిగతా విషయాలేమో గానీ సెలబ్రిటీలు పేరు చెప్పి డబ్బులు కాజేసే పనులు చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు వెనకేసుకునే పనిలో పడ్డారు. కానీ సదరు నటి స్పందించడంతో బండారం అంతా బయటపడింది.

(ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష)

ఏం జరిగింది?
తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అల్య మానస.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదింంచింది. కొన్నిరోజుల క్రితం 'వణక్కం తమిళగం' అనే షోలో పాల్గొంది. ఆ షోలో ఈమె.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నానని ఈమె చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలు పత్రికల్లోనూ ఇదే విషయం పబ్లిష్ కాగా.. ఈ విషయం అల్య మానస దృష్టికి వెళ్లింది.

'అల్య మానస బాగా డబ్బు సంపాదిస్తోంది. ఈమెలానే మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటే.. దిగువన లింక్ క్లిక్ చేయండి' అని తన పేరు చెప్పి జరుగుత్ను మోసంపై అల్య మానస ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మార్కెటింగ్ స్కీమ్ గురించి షోలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కారు-ఇల్లు కొన్న విషయం నిజమే కానీ వాటిని ఈఎంఐ పద్ధతి తీసుకున్నానని చెప్పింది. అన్నింటికీ మించి అడ్డదారిలో కోటీశ్వరురాలిని కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు)

Advertisement
 
Advertisement