ఉన్నట్టా... మరి లేనట్టా...  | Actor Srikanth Launched Itlu Mee Yedhava Movie Song | Sakshi
Sakshi News home page

ఉన్నట్టా... మరి లేనట్టా... 

Oct 24 2025 4:37 AM | Updated on Oct 24 2025 4:37 AM

Actor Srikanth Launched Itlu Mee Yedhava Movie Song

త్రినాథ్‌ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు  ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటించారు. సంజీవని ప్రొడక్ష న్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. 

ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఉన్నట్టా... మరి లేనట్టా...’ అంటూ సాగే పాటని హీరో శ్రీకాంత్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్‌ చాలా కొత్తగా ఉంది.

 ‘ఉన్నట్టా... మరి లేనట్టా...’ పాట చాలా అద్భుతంగా ఉంది. ఆర్పీ పట్నాయక్‌గారు బాగా కం పోజ్‌ చేశారు. త్రినాథ్, సాహితీ జోడీ చాలా బాగుంది. ప్రొడ్యూసర్‌ శంకర్, కెమెరామేన్‌ జగదీష్‌ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘ఉన్నట్టా... మరి లేనట్టా...’ పాటకి పూర్ణాచారి లిరిక్స్‌ అందించగా, ఎస్పీ చరణ్, శ్రుతిక సముద్రాల పాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement