బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్‌ ఉందా? | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్‌ ఉందా?

Published Mon, Oct 16 2023 7:23 AM

Actor Sivaji Leave Bigg Boss 7 Telugu - Sakshi

బిగ్‌బాస్ సీజన్ 7లో వివాదాస్పద కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శివాజీ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు  అనేకంటే పంపేశారు అని చెప్పడం కరెక్ట్‌. ఆదివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత చూపించిన ప్రోమోలో ఈ విషయం కనిపిస్తుంది. నయని పావని ఎలిమినేషన్‌ అయిన తర్వాత సడెన్‌గా శివాజీ కన్ఫెషన్ రూమ్‌లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆ సమయంలో బిగ్‌బాస్ చెప్పాడు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

దీంతో  శివాజీ కూడా బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్‌మెట్స్‌తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దని ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. అదే సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆట నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లే

శివాజీ మళ్లీ వచ్చే ఛాన్స్‌ ఉందా
ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా వైర్స్ కింద నుంచి పాకుతూ వెళ్లే గేమ్‌లో శివాజీ గాయపడ్డాడు . దీని తర్వాత ఆయన పెద్దగా టాస్క్‌లలో పాల్గొనలేదు. భుజం చెయ్యి నొప్పి భరిస్తూనే హౌస్‌లో కొనసాగాడు. బిగ్‌బాస్‌లో ఎవరికైనా ఇలాంటి చిన్న ఇబ్బందికి గురైతే షో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న శివాజీకి వైద్యులు సలహా మేరకే ఆయన హౌస్‌ నుంచి బయటకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. నేడు ఆయనకు వైద్యుల సమక్షంలో ఆయన చేతికి ఎక్స్‌రే వంటివి తీసి చికిత్స అందిస్తారని సమాచారం.

వీలైతే ఆయన్ను సీక్రెట్‌ రూమ్‌లో మరో రెండురోజుల పాటు విశ్రాంతి కల్పించి మళ్లీ హౌస్‌లోకి తప్పకుండా వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బిగ్‌బాస్‌-3 సీజన్‌లో కూడా నూతన్‌ నాయుడు చేతికి గాయం అయితే రెండురోజులు విశ్రాంతి ఇచ్చి మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఈ లెక్కన శివాజీ బిగ్‌బాస్‌లోకి మంగళవారం లేదా బుధవారం తప్పకుండా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement