నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Hyderabad Drugs Case: Tollywood Actor Navdeep Drugs Case Narcotics Team Investigation - Sakshi
Sakshi News home page

Navdeep Drugs Case: 6 గంటల పాటు విచారణ.. నవదీప్ ఏం చెప్పాడు?

Published Sat, Sep 23 2023 5:41 PM

Actor Navdeep Drugs Case Narcotics Team Investigation - Sakshi

డ్రగ్స్ కేసులో భాగంగా తెలుగు నటుడు నవదీప్‌ని నార్కోటికి అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా పూర్తయిన తర్వాత బయటకొచ్చిన నవదీప్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాల్ని బయపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? నవదీప్ ఏం చెప్పాడు?

ఏం జరిగింది?
ఈ సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. తాజాగా అతడిని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. ఇది పూర్తయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

నవదీప్ కామెంట్స్
'డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ అది పదేళ్ల క్రితం విషయం. నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్‌ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరముంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులని కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోంది' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: సీరియల్ బ్యాచ్‌ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!)

Advertisement
Advertisement