ఎక్కడి ధాన్యం అక్కడే..! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి ధాన్యం అక్కడే..!

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

కొనుగోలు కేంద్రాలు దాటని వైనం

‘వారం రోజులుగా లారీలు రాలేవు. ఎక్కడి ధాన్యం అక్కడే కేంద్రాల్లో నిలిచి పోయింది. రాత్రింబవళ్లు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం. వానలు పడితే మా కష్టం నీళ్ల పాలవుతుంది అంటూ.. హవేలిఘనాపూర్‌ రైతులు సోమవారం మెదక్‌–బోధన్‌ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఇలా వారం రోజుల నుంచి ఏదో ఒక గ్రామంలో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు’

మెదక్‌ అర్బన్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్లు అన్నదాతలకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మిల్లులను చేరడం ప్రహసనంగా మారింది. మెదక్‌ జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేరే అవకాశం ఉండగా, ఇప్పటి వరకు 90,685 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తూకం చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా జరగడానికి ప్రధాన కారణం ట్రాన్స్‌పోర్టు.. హమాలీల కొరతగా భావిస్తున్నారు. అలాగే మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడ్‌ చేయడానికి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీ వెతలు

ధాన్యం ట్రాన్స్‌పోర్టు వ్యాపారం, గుత్తేదార్లకు సిరులు కురిపిస్తుండటంతో పోటీపడి టెండర్లు కై వసం చేసుకుంటున్నారు. మెదక్‌ జిల్లాలో నర్సాపూర్‌, మెదక్‌ క్లస్టర్లు ఉన్నాయి. టెండర్‌లో పాల్గొనే వారు సొంతంగా 30, లీజ్‌కు 30 లారీలు సమకూర్చే ఽశక్తి కలిగి ఉండాలి. అయితే వీరు కాగితాలోల సామర్థ్యాన్ని చూపుతూ.. టెండర్లు కై వసం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మెదక్‌ టెండర్‌ ప్రస్తుతం బాలాజీ వీరభద్ర రోడ్‌ లైన్స్‌ పేరిట మూడేళ్లుగా, అంతకు ముందు ఇదే టెండర్‌దారు బాలాజీ రోడ్‌లైన్స్‌ పేరిట 2021 నుంచి రెండున్నర ఏళ్లుగా ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇక నర్సాపూర్‌ టెండర్‌ హైదరాబాద్‌ మెదక్‌ ట్రాన్స్‌పోర్టు పేరిట సుమారు పదేళ్లుగా టెండర్‌ కై వసం చేసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవంగా వీరు టెండర్‌లో చూపిన లారీలు ,క్షేత్రస్థాయిలో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రవాణ చార్జీల కింద 8 కి.మీటర్ల లోపు టన్నుకు రూ.417లు, 8 నుంచి 20 కి.మీ వరకు అదనంగా రూ.3లు, 80 కి.మీ వరకు టన్నుకు రూ.450 చెల్లిస్లారు. సన్న వడ్లకు డిమాండ్‌ బాగా ఉండటంతో మిల్లు యజమానులు సొంత వాహనలను కొనుగోలు కేంద్రాలకు పంపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ డబ్బులు ట్రాన్స్‌పోర్టర్లకు మిగిలిపోతున్నాయి. ఇలా గుత్తేదారులు లాభ పడుతున్నా. సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

సకాలంలో రాని బిహారీలు

స్థానికులెవరూ హమాలీ పని చేయడానికి ముందుకు రాకపోవడంతో, బిహారీ హమాలీలపైనే కొనుగోలు కేంద్రాలు ఆధారపడుతున్నాయి. ఈసారి సకాలంలో బిహారీలు రాకపోవడంతో, ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదని తెలుస్తుంది. జిల్లాలో సుమారు వంద మిల్లులకు ఽసీఎంఆర్‌ ధాన్యం ఇస్తున్నారు. ఇందులో గత వర్షాకాలం ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉండటంతో, కొత్తగా వెళతున్న ధాన్యం.. సకాలంలో అన్‌లోడ్‌ కావడం లేదు. దీంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి.

అన్‌లోడ్‌ ఆలస్యం అవుతుంది

మిల్లుల్లో అన్‌లోడ్‌ ఆలస్యం అవుతుండటతో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. అలాగే హమాలీల కొరత కూడా ఒక కారణంగా మారింది. కొనుగోళ్లు వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –జగదీశ్‌, డీఎం

రవాణాలేమి.. హమాలీ వెతలు

ఐదేళ్ల నుంచీ ఒక్కరే ట్రాన్స్‌పోర్టర్లు

రోజుకో చోట రోడ్డెక్కుతున్న రైతులు

మొత్తం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం లక్ష్యం

ఇప్పటి వరకు కేవలం 90,685 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

Advertisement
 
Advertisement
Advertisement