సమ్మర్ క్యాంపు ప్రారంభం
ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్
నర్సాపూర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సాయిభగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడం విచారకరమన్నారు. వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, అప్పుడే కేసు విచారణ సక్రమంగా కొనసాగేందుకు అవకాశం ఉందన్నారు. హోం శాఖ సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉందని, మహిళలకు రక్షణ కరువైనా స్పందించడం లేదన్నారు. బాలిక స్టేట్‌మెంట్‌ను వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయించాలని డిమాండ్ చేశారు.
అర్హులందరికి ఇళ్లు మంజూరు చేయాలి
శివ్వంపేట(నర్సాపూర్): అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రతాలు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామిరెడ్డి, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ రాజ్‌కుమార్, సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు చంద్రగౌడ్, పవన్‌గుప్తా, మహిపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సయ్య, రాజశేఖర్‌గౌడ్ ఉన్నారు.
అంతకు ముందు జెడ్పీ ఉన్నత బాలుర పాఠశాలలో సమ్మర్ క్యాంపు, కోమటికుంట సుందరీకరణ పనులు, పట్టణంలోని 12వ వార్డులో జనగణన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, కమిషనర్ సాయికుమార్, ఎంఈఓ తారాసింగ్, హెడ్మాష్టర్ సామ్యానాయక్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


