కలెక్టర్‌పై కుట్రలా? | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌పై కుట్రలా?

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం

రామాయంపేట(మెదక్‌): నిజాయితీపరురాలైన కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ను కొందరు అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రభాతరావు, అహ్మద్‌, మద్దెల రమేశ్‌ విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలకుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుక కలెక్టర్‌పై నిందలు వేయడం తగన్నారు. దీని వెనుక రైసుమిల్లు మాఫియా, రియల్‌ ఎస్టేట్‌, ఇసుక మాఫియా ఉందని వారు ఆరోపించారు. జిల్లా ప్రజలు కలెక్టర్‌కు అండగా ఉన్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వెంటనే అన్ని మండలాల్లో సాండ్‌ బజార్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు యాదగిరి, హస్నొద్దీన్‌, వెంకటేశ్‌, వినయ్‌, తదితరులు పాల్గొన్నారు.

నంగునూరు(సిద్దిపేట): పాలిసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌, రాజగోపాలపేట పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గోవర్ధన్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లోమా, వ్యవసాయ వెటర్నరీ కోర్సులో ప్రవేశాల కోసం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 1.30 వరకు పరీక్ష జరుగుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,037 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌లో కలిపి మొత్తం 11 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నిమిషం నిబందన అమలులో ఉందని, ఓఎంఆర్‌ షీట్‌కు రెండు వైపులా విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement