బస్సులు లేక జనం తిప్పలు | - | Sakshi
Sakshi News home page

బస్సులు లేక జనం తిప్పలు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

నారాయణఖేడ్‌: అసలే పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ఆర్టీసీలో చాలావరకు బస్సులను హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని మోదీ సభకు తరలించడంతో బస్సులకోసం ప్రయాణికులు ఆదివారం ఇబ్బందులు పడ్డారు. ఖేడ్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన హైదరాబాద్‌ రూట్‌లో నిత్యం అరగంటకు ఒక బస్సు చొప్పున 33 సర్వీసులు నడుస్తుంటాయి. సాధారణంగా ఖేడ్‌ నుంచి హైదరాబాద్‌ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు అత్యధికంగా ఉంటారు. డిపో నుంచి 35 సర్వీసులను ప్రధాని మోదీ సభకు తరలించారు. దీంతో 9 బస్సు సర్వీసులు మాత్రమే హైదరాబాద్‌ రూట్‌లో నడిపారు. దీంతో బస్టాండ్‌ జనాలతో కిక్కిరిసి పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement