చిన్నశంకరంపేట(మెదక్): కొనుగోలు కేంద్రానికి 15 రోజులుగా ఒక్క లారీ రాలేదని మండలంలోని సూరారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు వెంటనే లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే మండలంలోని అంబాజిపేట కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కలారీ కూడా వెళ్లలేదని తెలిపారు. ధాన్యం కుప్పలుగా పేరుకుపోయినా, కాంటా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


