చిన్నశంకరంపేట/రామాయంపేట (మెదక్):
ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయిన ధాన్యం లారీలను పరిశీలించారు. రోజుకు ఎన్ని లారీలను అన్‌లోడింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. లారీలను త్వరగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 75 మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించడంతో పాటు రైతుల ఖాతా ల్లో డబ్బులు కూడా జమ చేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్‌ఐ శ్రీధర్, సిబ్బంది ఉన్నారు.
అనంతరం రామాయంపేట మండలంలోని దామరచెరువు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంలో వెంట వెంట ధాన్యం తూకం వేసి తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట సహకార సంఘం సీఈఓ నర్సింలు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


