తూప్రాన్: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా నియామకమైన యంజాల కీర్తన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, రైతుల కోసం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యంజాల కీర్తన, విఠల్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


