జనగణనపై ప్రజలకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

జనగణనపై ప్రజలకు అవగాహన

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

చేగుంట(తూప్రాన్‌): మండల పరిధి చందాయిపేట గ్రామంలో మొదటి దశ జనగణన విషయంలో తహసీల్దార్‌ శివప్రసాద్‌ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతుందని మొదటి విడతలో జనగణన పత్రంలో వివరించిన అంశాలను మాత్రమే ప్రజలు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆధార్‌, ఓటీపీ లాంటి విషయాలను అడగటం లేదని.. కేవలం ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహేశ్వరీ, ఉపసర్పంచ్‌ నగేష్‌, ఏఎస్‌ఓ భూమేశ్‌, ఫీల్డ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌, పంచాయతీ కార్యదర్శి కృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement