పాపన్నపేట(మెదక్): మండల పరిధి నాగ్సాన్‌పల్లిలో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 94 గేదెలు, 48 ఆవులకు గర్భధారణ చికిత్సలు చేసినట్లు పశువైద్యాఽధికారులు సౌమ్య, ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవికాలంలో పశువులను ఎండలో తిప్పకుండా నీడలో ఉంచాలని అన్నారు. ఎప్పటికప్పుడు తగినంత నీరు అందించాలని సూచించారు. పశువులకు గర్భధారణ, ఎదకు రాని పశువులకు అందించాల్సిన చికిత్సల గురించి అవగాహన కల్పించారు. సరైన సమయంలో టీకాలు వేయించాలని కోరారు. 37 దూడలకు నట్టల మందు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ దండెం సుశీల, ఉపసర్పంచ్ సిరాజ్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఎం.సతీష్ కుమార్, గోపాల మిత్ర సూపర్‌వైజర్ శ్రీనివాస్‌రెడ్డి, షర్పొద్దీన్ పాల్గొన్నారు.
పశువాధ్యులపై అవగాహన
రేగోడ్(మెదక్): ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పశువైద్యాధికారి వీరేశం కోరారు. మండలంలోని జగిర్యాల గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ వీరమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరేశం మాట్లాడుతూ.. పశువులకు సంబంధించి గర్భకోశ వ్యాధులు, పొడవు వాపు, సీజనల్ టీకాలు, దుడ్డేల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. అనంతరం పశువులకు టీకాలు వేశారు.
పశువైద్యశిబిరాలతో లబ్ధి
కొల్చారం(నర్సాపూర్): పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పశువైద్యాధికారిని ప్రియాంక అన్నారు. శుక్రవారం ఆమె ప్రియాంక మాట్లాడుతూ.. పశు పోషకులు వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిబిరంలో 10 పశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ, 28 దూడలకు నట్టాల నివారణకు మందులు తాగించామన్నారు. 20 పాడి గేదెల్లో గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స చేసినట్లు తెలిపారు.
గర్భకోశ వ్యాధులు నివారించుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): పశువుల్లో గర్భకోశ వ్యాధులు నివారించుకోవాలని మండల పశువైద్యాధికారి ఫర్హిన్ ఫాతిమా తెలిపారు. శుక్రవారం కౌడిపల్లిలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. పశువులకు వ్యాధి సోకగానే చికిత్సలు చేయించాలన్నారు.
పశుపోషణపై అవగాహన
చిన్నశంకరంపేట(మెదక్): వేసవికాలంలో పశుపోషణపై మండల వెటర్నరీ డాక్టర్ గీతామాలిక అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని కామారం గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉపసర్పంచ్ సుధాకర్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


