సబ్సిడీ పథకాలతో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ పథకాలతో ప్రయోజనం

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

టేక్మాల్‌(మెదక్‌): ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ తిమ్మిగారి సుధాకర్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రం టేక్మాల్‌ పశువైద్యశాల డాక్టర్‌ నాగరాజు ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందులను, సబ్సిడీ పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో రైతులు పశుసంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేగదూడలకు పాలు తాగించడం, డివార్మింగ్‌ చేయడం వాటి పోషణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో వెల్పుగొండ పశువైద్యాధికారిణి డాక్టర్‌ సౌమ్య, ఉపసర్పంచ్‌ శంకరయ్య, జూనియర్‌ పశువైద్యాధికారులు హనుమంతు, అమరావతి, గోపాల మిత్రలు దీపక్‌, రవి, దేవరాజ్‌, ఆనంద్‌, కృష్ణ, శ్యామల గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement