బ్యాంకుల్లో భద్రతపై దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో భద్రతపై దృష్టి పెట్టండి

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

మెదక్‌జోన్‌: బ్యాంకుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, గోల్డ్‌లోన్‌ సంస్థల మేనేజర్లతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు, ఆటోమేటిక్‌ అల్లారం సిస్టమ్స్‌, మెటల్‌ డిటెక్టర్లు అమర్చాలన్నారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలను గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించుకోవాలని ఆదేశించారు. పనిచేయని సీసీటీవీలను ఎప్పటికప్పుడు బాగు చేయించి, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్‌ చేయాలని వివరించారు. సైబర్‌ నేరాలపై కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్‌, నరేందర్‌గౌడ్‌, సీఐలు సందీప్‌రెడ్డి, కృష్ణమూర్తి, బ్యాంక్‌ మేనేజర్ల్‌ పాల్గొన్నారు.

ఎస్పీ శ్రీనివాస్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement