మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పనిచేస్తున్న ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమంగా జీతాలు ఇవ్వడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి ఇతర సౌకర్యాలు తప్పకుండా అందించాలన్నారు. సౌకర్యాలు కల్పించని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వేరే ఏజెన్సీలకు అందిస్తామన్నారు. వారి పనితీరును ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రామరాజు, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి హేమభార్గవి, లేబర్ ఆఫీసర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వం
రామాయంపేట(మెదక్): రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించి అధికారులు రైతులకు తగిన సూచనలు, సలాహాలు ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్స న్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవి నాయక్, స్వప్న, ప్రవీణ్, శ్యామల, యార్డు కార్యదర్శి ఈశ్వర్, పీఏసీఎస్ సీఈఓ నర్సింలు, వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు.
రైతులకు
ఇబ్బంది రానీయొద్దు
తూప్రాన్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇ బ్బందులకు రానీయొద్దని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వడ్ల కొనుగోలులో తూకం సుమారు బ్యాగుకు 40 కిలోల 600 గ్రాములు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. తూకం జరిగిన ధాన్యాన్ని ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. ధాన్యం త్వరగా ఖాళీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రైస్‌మిల్లర్లకు సూచించారు.
కష్టజీవుల ఆట పాట
చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి హామీ డబ్బు లు కూలీల ఖాతాల్లో జమయ్యాయి. ఇంకేముం ది సంతోషంతో తలా ఇన్ని డబ్బులు పోగుచేసుకొని పని ప్రదేశంలో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆట పాటలతో కూలీలు సందడి చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామంలో బుధవారం జరిగిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి గోల్ షాట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు గోల్ షాట్‌బాల్ సెక్రటరీ మహేష్ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నుంచి 11వరకు జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు అక్షయ, అర్చన, కృపారాణి పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను పీడీ సుజాత తదితరులు అభినందనలు తెలిపారు.


