బొడ్మట్‌పల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని కడియం కుస్తీ వరకు పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీలలో ఇద్దరిపై మహారాష్ట్ర ఉద్గిర్‌కు చెందిన ధీరజ్ గెలుపొందడంతో గ్రామస్తుడు సంగయ్య సహకారంతో చేయించిన ఆరు తులాల వెండి కడియాన్ని విజేతకు బహుమతిగా అందించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
– టేక్మాల్(మెదక్)
తలపడుతున్న మల్లయోధులు


