నర్సారెడ్డిపై పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

నర్సారెడ్డిపై పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

తూప్రాన్‌: వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నియామక ంలో కాంగ్రెస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తూంకుంట నర్సారెడ్డి అవినీతికి పాల్పడినట్లు మండల కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించి ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి కమిటీలో పదవులు కల్పించారని వివరించారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలతో విసిగిపోయి తాము సామూహిక రాజీనామాలకు సిద్ధ పడుతున్నట్లు చెప్పారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పీసీసీ చీఫ్‌ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్సర్‌, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు సురేశ్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అజయ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement