మెదక్‌ డీఆర్వోగా అంబదాస్‌ రాజేశ్వర్‌ | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ డీఆర్వోగా అంబదాస్‌ రాజేశ్వర్‌

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

మెదక్‌ డీఆర్వోగా అంబదాస్‌ రాజేశ్వర్‌ ధాన్యం వెంట వెంటనే దించుకోండి ఉద్యాన పంటలు సాగు చేయండి 17న ప్రవేశ పరీక్ష

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ డీఆర్వోగా అంబదాస్‌ రాజేశ్వ ర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సివిల్‌ సప్లై శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈమేరకు డీఆర్వోగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంబదాస్‌ 2003లో మెదక్‌ ఆర్డీఓగా పనిచేశారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం వెంట వెంటనే లారీల నుంచి దించుకునేలా హమాలీల సంఖ్యను పెంచుకోవాలని డీఎం జగదీశ్వర్‌, డీఎస్‌ఓ నిత్యానంద్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలోని రైస్‌మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం లారీలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లారీలు నిలిచిపోతే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వారి వెంట నార్సింగి తహసీల్దార్‌ గ్రేసిబాయి ఉన్నారు.

నర్సాపూర్‌: ఉద్యాన పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ రామకృష్ణ, ఉద్యానవన ఏడీఏ అనిత, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈనెల 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 14వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్‌ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రెజా సూచించారు. ఇతర వివరాల కు హెల్ప్‌లైన్‌ 8884984000 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement