రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీత
నర్సాపూర్/శివ్వంపేట/మెదక్ కలెక్టరేట్: బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీత సూచించారు. మంగళవారం కమిషన్ సభ్యులు వందనగౌడ్, చందన, అపర్ణ, వచన్ కుమార్‌లతో కలిసి పట్టణంలోని భవిత, వికాసం కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. శారీరక వైకల్యం కలిగిన చిన్నారిని చూసి ఆమె చలించారు. అధికారులతో మాట్లాడి చిన్నారికి ఆపరేషన్ చేయించాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ నగేశ్‌తో పాటు పలువురు ఆయా శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం శివ్వంపేట మండల పరిధిలోని మగ్ధుంపూర్ బేతాని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రం టిక్యా దేవమ్మగూడం తండా అంగన్‌వాడీ కేంద్రం, ఉసిరికపల్లిలోని ఇటుక బట్టిలను సందర్శించారు. చివరగా మెదక్ జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను సందర్శించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నత విద్యా విధానం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.


