మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో వస్తారని, వారు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించి తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి మొ త్తం 45 దరఖాస్తులు రాగా, ఇందులో భూ భారతి 15, పెన్షన్లు 15, ఇతర సమస్యలపై మరో 15 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించినా, ప్రజల నుంచి ఆదరణ కనిపించలేదు. మెదక్‌లో 9, తూప్రాన్ 2, నర్సాపూర్ 2 వినతులు వచ్చినట్లు అధికారులు చెప్పారు.
అదనపు కలెక్టర్ నగేశ్


