పండించిన పంటను ఇబ్బందులు లేకు ండా అమ్ముకునేందుకు వీలు కల్పించాలి. వరి కోసిన నాటి నుంచి కామారెడ్డి జిల్లా లింగంపేట కొనుగోలు కేంద్రానికి వెళ్లి బతిమిలాడి లారీలు తీసుకురావాల్సి వస్తోంది. ఏటా ఇదే పునరావృతం అవుతోంది. ఇప్పటికై నా ఇబ్బందులు తీర్చాలి.
– మల్లయ్య, రైతు, కొత్తపల్లి
సమస్యను పరిష్కరించాలి
జిల్లా సరిహద్దు కొత్తపల్లి శివారులో ఉన్న భూములు సాగు చేసుకోవడం తప్పా. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే వీలు కల్పించని అధికారులు ఏం చేస్తున్నారు. ఎన్నోమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– సాయిలు, కొత్తపల్లి


