ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

గజ్వేల్‌: భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పద్మశ్రీ డాక్టర్‌ గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా మందిరం ఆవరణలో ఆదివారం రాత్రి ‘సనాతన సారధి’ అనే అంశంపై మాట్లాడారు. భగవంతుడిని స్మరించడం వల్ల మానసికశాంతి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న కార్యక్రమాలను పూర్తి చేసేవరకు ఆపవద్దన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

పద్మశ్రీ డాక్టర్‌ గరికపాటి నరసింహరావు

Advertisement
 
Advertisement
Advertisement