మెదక్‌జోన్: జిల్లాలో భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లాయి. ఎండత తీవ్రత పెరగడంతో అంతే వేగంగా భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఏకంగా 2.12 మీటర్ల లోతుకు పడిపోయాయి. మొత్తంగా 13.98 మీటర్లకు చేరగా, నార్సింగి మండలంలో ప్రమాదకరంగా 24.9 మీటర్ల లోతుకు నీటిమట్టం చేరుకుంది. రెండో స్థానంలో చిలప్‌చెడ్ మండలంలో 21.20 మీటర్లకు చేరుకుంది. మిగితా మండలాల్లో నిలకడగా ఉండగా, ఈ రెండు మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఆ రెండు మండలాల్లో ౖపైపెనే..
జిల్లాలో వ్యవసాయ సాగు పనులు ముగిసినప్పటికీ భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. మార్చిలో 11.86 మీటర్ల లోతులో ఉండగా, నెలరోజుల వ్యవధిలో 2.12కు పడి పోయాయి. ఫిబ్రవరిలో 10.67 మీటర్లు ఉంది. అంటే రెండు నెలల్లోనే 3.31 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. సాధారణం కంటే ఎక్కువ గానే నీటి వనరులు పడిపోతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా హవేళిఘణాపూ ర్ మండలంలో 10.47 మీటర్లలో ౖపైపెనే ఉండగా, మనోహరాబాద్ మండలంలో సైతం 10.8 మీటర్లలోతులోనే ఉండటం గమనార్హం.
గతేడాదితో పోలిస్తే నయం
గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు కాస్త బెటర్‌గా ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో 15.85 మీటర్లలోతులో నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 13.98 మీటర్లలో ఉంది. ఈలెక్కన గతేడాది కంటే 1.87 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
జిల్లాలో చెప్పుకోదగిన సాగు నీటి వనరులు లేకపోవటంతో 90 శాతం మంది రైతులు బోరు బావులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, వానాకాలంలో నీరంతా వృథాగా పోతుంది. ఆ నీటిని ఒడిసిపడితే భూగర్భజలాలు స్థిరంగా ఉంటాయని పలువురు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇంకుడు గుంతలు, ప్రతి రైతు తన పొలంలో విధిగా పాంపండ్స్ నిర్మాణాలు విరివిగా చేపడితే భూగర్భజలాలు వేసవిలోనూ సమృద్ధిగా ఉంటాయి.
వర్షం నీటిని ఒడిసిపడితేనే..
వేగంగా పడిపోతున్న భూగర్భజలం
జిల్లావ్యాప్తంగా
13.98 మీటర్ల లోతులో నీటిమట్టం


