తనిఖీలు నిర్వహి స్తున్న సిబ్బంది
మెదక్‌జోన్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష కొనసాగింది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల వరకు లోనికి అనుమతించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 479 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 465 మంది హాజరయ్యారు. ఇందులో ముగ్గురు బాలికలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావటంతో లోనికి అనుమతించలేదు. మరో 11 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఏకై క పరీక్ష కేంద్రం కావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.


