మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో నిర్వహించే వ్యవసాయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు షెడ్యూల్ వారీగా వ్యవ సాయ అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. జనగణనకు సంబంధించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు సలహాలు అ ందించారు. డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, ప్రతి వినతికి ప్రత్యేక ధ్రువీకరణ నంబర్ కేటాయించాలన్నారు. ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


