ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, రాములు, ఎల్లయ్య, నర్సింహులు, సతీశ్, శ్రీహరి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు


