కేసుల విచారణలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

కేసుల విచారణలో వేగం పెంచండి

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు సిబ్బందిని ఆదేశించారు. శనివారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అంకితభావంతో పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. నేరానికి పాల్పడినవారు ఎంతటివారైన చట్టపరమైన శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, కేడీ లు, అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, తరుచు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేరుగా సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ సృజన, సీఐ వెంకటరాజంగౌడ్‌ ఉన్నారు.

ఎస్పీ శ్రీనివాస్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement