మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

సిద్దిపేటకమాన్‌: మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో 30మంది న్యాయవాదులకు 40గంటల మీడియేషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి నందా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 684 మంది అడ్వకేట్లకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మీడియేషన్‌ ద్వారా ఆస్తి వివాదాలు తదితర కేసుల్లో సత్వరం న్యాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ మెంబర్‌ పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తులు జయప్రసాద్‌, సంతోష్‌కుమార్‌, సాధన, తరణి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement