కొలువుదీరిన కొత్త పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కొత్త పాలకవర్గం

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

తూప్రాన్‌: తూప్రాన్‌ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరింది. చైర్‌పర్సన్‌గా మనోహరాబాద్‌ మండలం ధర్మారాజుపల్లికి చెందిన యంజాల కీర్తన, వైస్‌ చైర్మన్‌గా మామిండ్ల కృష్ణ, డైరెక్టర్లుగా పలువురు బాధ్యతలు చేపట్టారు. కాగా 2017లో తూప్రాన్‌ మార్కెట్‌ కమిటీ ఏర్పడింది. అప్పటి నుంచి పాలకవర్గం ఏర్పడలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పదవులు వరించాయి. దీంతో తూప్రాన్‌ ఉమ్మడి మండలంలో కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈసందర్భంగా పాలకవర్గ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఎలక్షన్‌రెడ్డి, పురం రవి, మాజీ ఎంపీపీ నవనీత, సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement