రైతులను ఆదుకోవడంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవడంలో విఫలం

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

రామాయంపేట(మెదక్‌): రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. శనివారం రామా యంపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులకు నష్టం వస్తుందన్నారు. రైస్‌ మిల్లర్లు, దళారులు, కొంతమంది అధికారులు కుమ్ముక్కయి రైతులను మోసం చేస్తున్నారని, ఈ దోపిడీని అరి కట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఆగస్టులో, ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా పథకంలో చేరకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాములు, సీనియర్‌ నాయకులు విజయకుమార్‌, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు సత్యం, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శంకర్‌గౌడ్‌, మండల శాఖ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట నియోజకవర్గ కేంద్రాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా జేఏసీ ప్రతినిధి పోచమ్మల అశ్విని వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement