పథకాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

పథకాలపై అవగాహన అవసరం

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

నర్సాపూర్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సిబ్బందికి సూచించారు. శనివారం పట్టణంలోని వైపర్‌ కాలేజీలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద అర్హులకు ఆర్థిక సహాయం అంజేచేస్తున్నామని తెలిపారు. అర్హులకు రేషన్‌కార్డులు అందజేశామన్నారు. అనంతరం ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. పలువురు అనాథ పిల్లలకు పుట్టిన రోజు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, ఆర్డీఓ రామకృష్ణ, డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, సీఐ జాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement