అల్లాదుర్గం(మెదక్): స్టేజీల వద్ద బస్సులు అపడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్, కండక్టర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈసంఘటన మండల పరిధిలోని చిల్వెరలో శుక్రవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు నారాయణఖేడ్ వెళ్తుంది. మార్గమధ్యలో చిల్వెరలో ప్రయాణికులు దిగాల్సి ఉండగా, స్టేజీ లేదు ఆపమని సిబ్బంది చెప్పారు. ఆర్డీనరీ బస్సులు లేవు, ఉన్న ఎక్స్‌ప్రెస్ ఆపకుంటే ఎలా ఇళ్లకు చేరుకోవాలని ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. దీంతో నాలుగు బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్సులు నిలపకుంటే మహాలక్ష్మి పథకం ఎందుకని మహిళలు ప్రశ్నించారు.


