అన్నివర్గాలను ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాలను ఆదుకుంటాం

May 2 2026 11:31 AM | Updated on May 2 2026 11:31 AM

హన్మంతరావు

మెదక్‌జోన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నివర్గాలను కాపాడుకుంటుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం ఆర్టీసీ బస్‌డిపో వద్ద కార్మిక జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మె ప్రారంభించిన వెంటనే కార్మిక సంఘ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్టీసీ కార్మికులు నెలరోజులకు పైగా సమ్మె చేసినా, కనీసం ఆ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అనంతరం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకిషన్‌రావు మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు డిపో ప్రాంగణంలో ఐసీడీఎస్‌శాఖ ఏర్పాటు చేసిన చిన్నారుల రక్షణ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌, నేతలు భూపతిరాజు, అరుణార్తి వెంకటరమణ, రాములు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర నేత

Advertisement
 
Advertisement
Advertisement