ప్రాణం తీసిన రుణ భారం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన రుణ భారం

May 2 2026 11:31 AM | Updated on May 2 2026 11:31 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): రుణభారంతో ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని తనువు చాలించాడు. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన బోడ చంద్రశేఖర్‌ (45) ప్రైవేట్‌ కళాశాల లెక్చరర్‌గా పనిచేశాడు. ఇతడికి రెండుసార్లు పెళ్లి జరిగినా, ఇద్దరు భార్యలు కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇల్లును విక్రయించి డబ్బులు చెల్లించాడు. అప్పులు పెరగడంతో క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలు తీసుకున్నాడు. సమయానికి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితితో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆరునెలల క్రితం రుణబాధలు భరించలేకపోతున్నానని ఇంట్లో లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గతంలో కామారెడ్డి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం వల్లూర్‌ జాతీయ రహదారి పక్కన పంటపొలాల్లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఆధార్‌కార్డు ఆధారంగా కామారెడ్డిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement