డీఈఓ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

డీఈఓ సేవలు అభినందనీయం

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌

మెదక్‌జోన్‌: విధి నిర్వహణలో డీఈఓ విజయ సేవలు అభినందనీయమని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ కొనియాడారు. గురువారం పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. 2023లో డీఈఓగా బాధ్యతలు స్వీకరించి విద్యాశాఖలో క్రియాశీల అధికారిగా బాధ్యతాయుతంగా వ్యవహరించారని అన్నారు. ఉత్తమ అధికారిగా ప్రశంసలు సైతం పొందారన్నారు. ఈ ఏడాది వెస్లీ కళాశాలలో నిర్వహించిన విజ్ఞాన సదస్సు దిగ్విజయం కావడంలో ఆమె సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అధికారులు సుదర్శనమూర్తి, రాజిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పద్మారావు, శివయ్య, సంతోష్‌, సామ్యనాయక్‌, శ్రీనివాస్‌, రాజు, అశోక్‌, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement