చట్టానికి లోబడి దత్తత చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

చట్టానికి లోబడి దత్తత చేసుకోండి

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

నర్సాపూర్‌: చట్టానికి లోబడి పిల్లలను దత్తత చేసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు శివకుమారి, మెహత సూచించారు. ఈమేరకు పట్టణంలోని బస్టాండ్‌లో గురువారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలను మామూలుగా దత్తత తీసుకుంటే రాబోయే రోజుల్లో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. చట్ట ప్రకారం దత్తత తీసుకోవడం అన్ని విధాలా మంచిదన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులతో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అలాగే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఊయలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ మొజం హుస్సేన్‌, ఏరియా ఆస్పత్రి డాక్టర్‌ విష్ణువర్దన్‌, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ రఘువరన్‌, ఎంఈఓ తారాసింగ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుచ్చెశ్‌, పలువురు సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement