ఇన్‌చార్జి డీఈఓగా రాజు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి డీఈఓగా రాజు

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా విద్యాశాఖ అధికారిగా కామారెడ్డి డీఈఓ రాజుకు అదనపు బా ధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు మెదక్‌ డీఈఓగా పనిచేసిన విజయ రిటైర్డ్‌ కాగా, ఆమె స్థానంలో రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం డీఈఓగా రాజు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

బాలల సంరక్షణ

ఎగ్జిబిషన్‌ సందర్శన

మెదక్‌ కలెక్టరేట్‌: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో బాలల సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయమని సీ్త్ర, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వల్లేటి ప్రేమ్‌చంద్‌ కొనియాడారు. పట్టణంలోని బస్టాండ్‌ ఆవరణలో కొనసాగుతున్న బాలల సంరక్షణ ఎగ్జిబిషన్‌ను గురువారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు న్యాయపరమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగిరం చేయండి: మంత్రి

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కోహెడలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement