ఈ వేసవిలో ప్రత్యేక శిక్షణ జిల్లాలో 422 గ్రూపుల ఏర్పాటు మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు
రామాయంపేట(మెదక్): కిశోర బాలికల్లో సాధికారి త, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈవేసవి సెలవుల్లో 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలకు శిక్షణ ఇవ్వడానికి స్నేహ సంఘాలను ఏర్పాటు చేస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో సంఘాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది.
అధికారుల పర్యవేక్షణ
జిల్లాలోని 492 పంచాయతీల పరిధిలో స్నేహ సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 422 గ్రూపులు ఏర్పాటు చేశారు. వీటిలో 4,220 మంది కిశోర బాలికలు సభ్యులుగా చేరారు. ఈ వేసవి సెలవుల్లో బాలికలు విద్య, నైపుణ్యాల అభివృద్ధి విషయమై శ్రద్ధ చూపడం, ఆరోగ్య పరిరక్షణ, బాల్య వివాహాలు, కూలీ పనులకు దూరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. జిల్లా పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖ, సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎంపిక చేసిన కిశోర బాలికలకు 12 అంశాలపై వీఓఏలు, సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులు ప్రతి నెల రెండో, నాలుగో ఆదివారం శిక్షణ ఇవ్వనున్నారు.
అన్ని గ్రామాల్లో ఏర్పాటు
జిల్లాలో అన్ని గ్రామాల్లో స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా కిశోర బాలికలకు ప్రతి నెల రెండు, నాలుగో ఆదివారాలు ప్రత్యే కంగా శిక్షణ అందించనున్నాం. ముఖ్యంగా ఆరోగ్యం, చదువు, ఇతర అంశాలపై వారికి అవగాహన కల్పిస్తాం. వారు సమాజంలో తలెత్తుకొని బతికే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
శిక్షణలో నేర్పించేవి ఇవే..
సాధికారతకు ‘స్నేహ’ హస్తం


