రామాయంపేట(మెదక్): యువతను లక్ష్యంగా చేసుకొని మత్తు పదార్ధాల వ్యాప్తి పెరిగిపోతుందని అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై జరిగిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక యుగంలో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుందన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ మెయిల్స్, లింకులను నమ్మవద్దని హితవు పలికారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వంటివి గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలన్నారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాల పైనే కాకుండా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నా రు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్‌ఐ బాల్‌రాజు, కరస్పాండెంట్ రాంకుమార్ తదితరులు ఉన్నారు.


