డీఈఓ సేవలు అమోఘం | - | Sakshi
Sakshi News home page

డీఈఓ సేవలు అమోఘం

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యారంగానికి డీఈఓ విజయ చేసిన సేవలు అమోఘమని జిల్లా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మధుమోహన్‌ కొనియాడారు. గురువారం డీఈఓ ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో బుధవారం ప ట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె హయాంలోనే జిల్లా కేంద్రానికి పదో తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు కావడం అభినందించదగిన విషయమన్నారు. తక్కువ సమయంలోనే అందరి మన్ననలను పొందారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగం అధికారి కరుణాకర్‌, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర బాధ్యులు సత్యనారాయణ, వెంకటస్వామి, ప్రతాప్‌రెడ్డి, ఎంఈఓలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement